Minister RK Roja: చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజాకు సొంత పార్టీలోనే రోజు రోజుకు అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాలను మంత్రి రోజా త్వరలోనే ప్రారంభించాలనుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న రోజా వ్యతిరేకవర్గం నేత, వడమాల పేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి ఆదివారం ఈ మూడు కార్యాలయాలను తన పేరుతో శిలా ఫలకాలు ఏర్పాటు చేసి మరీ అనుచరులతో కలిసి ప్రారంభించడం విశేషం. గతంలోనూ పత్తిపుత్తూరులో సచివాలయ భవనం ప్రారంభానికి మంత్రి రోజా ఏర్పాట్లు చేసుకోగా, తనకు బిల్లులు ఇవ్వ నిదే ప్రారంభం చేయకూడదంటూ మురళీధరరెడ్డి తాళం వేశారు. ఇటీవల జడ్నీ సమావేశంలోనూ జడ్పీటీసీ సభ్యులు రోజాకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా మంత్రి రోజా నియోజకవర్గ పరిధిలో అసమ్మతి నాయకుడు ఒకే పర్యాయం మూడు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడం, అధికారులు చూసి చూడనట్లు వ్వవహరించడం చర్చగా మారింది.
Minister RK Roja: నగరిలో అసంతృప్తి సెగలు..! మంత్రి రోజా రాకముందే ప్రారంభోత్సవాలు..

Roja