లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు.. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM)కి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం ఈరోజు రాత్రి 8 గంటలకు ఐజ్వాల్‌లోని లాల్దుహోమా నివాసంలో జరగనుంది.
Read Also: Cyclone Michaung: 300 రైళ్లు రద్దు.. రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేసిన రైల్వే
జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) పార్టీ అధినేత 74 ఏళ్ల లాల్దుహోమా ఐపీఎస్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. మొదట గోవాలో విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత ఢిల్లీకి బదిలీకి అయ్యారు. తర్వాత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం సర్వీస్ నుండి బయటకు వచ్చి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) స్థాపించాడు. 1984 లో లోక్‌సభలో ఎన్నికయ్యారు.
Read Also: Kamal Nath: “ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు రాలేదు”.. ఇది ఎలా సాధ్యం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ZNP నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాల్దుహోమా ఎంపికయ్యారు. మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 7న జరగగా.. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఫలితాల్లో MNF ఓటమి పాలుకాగా.. జోరంతంగ
రాజ్ భవన్‌లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటికి తన రాజీనామాను సమర్పించారు.
