NTV Telugu Site icon

Mizoram Election Result 2023: మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో ZPM విజయం..

Mijoram

Mijoram

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌) ఘనవిజయం సాధించింది. ఈసారి అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం), కాంగ్రెస్‌ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరు భావించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 40 సీట్లున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) 27 సీట్లను గెలుచుకుంది. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) 10 స్థానాల్లో గెలుపొందింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్‌తంగా ఓడిపోయారు. దీంతో.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు.

Satyendar Jain: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం కోర్టు..

మిజోరంలో విజయం సాధించిన ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్​ నాయకుడు, వర్కింగ్​ ప్రెసిడెంట్​ కె. సప్దంగా తెలిపారు. సెర్చిప్​లో ఉన్న జెడ్​పీఎం నాయకుడు లాల్‌దుహోమా.. సోమవారం మధ్యాహ్నం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కలవనున్నట్లు ఆయన చెప్పారు. లాల్‌దుహోమా సెర్చిప్‌ స్థానంలో పోటీ చేసి తన సమీప ఎంఎన్‌జే అభ్యర్థిపై దాదాపు 3వేల ఓట్లతో గెలుపొందారు.

ఇదిలా ఉంటే.. మిజోరంలో లాల్‌దుహోమా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన లాల్‌దుహోమా ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆమె స్ఫూర్తితోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన లాల్‌దుహోమా.. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రెండుసార్లు అనర్హతకు కూడా గురయ్యారు. గెలుపోటములను భరించారు. ఎట్టకేలకు మిజోరంలో 1989 నుంచి వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరదించుతూ జడ్​పీఎంను అధికారానికి చేరువ చేశారు. ఈ క్రమంలో.. మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రద్దు.. గెటిట్ విడుదల

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణతో పాటు మిజోరంలో కూడా ఆదివారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే.. రాజకీయ పార్టీలు, NGOలు, చర్చిలు, విద్యార్థి సంస్థల నుండి విజ్ఞప్తుల తర్వాత ఎన్నికల ఫలితాల లెక్కింపును ఆపేశారు. క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరాం ప్రజలకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కాగా.. మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఓటింగ్ నిర్వహించగా, రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.