Site icon NTV Telugu

Zomato: ఇక మరింత ఫాస్ట్ గా ఫుడ్ డెలివరీ.. కాకపోతే ఖర్చు అవ్వుద్ది..

Zomato

Zomato

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కొత్త ఆలోచనలను తీసుకుంటుంది. ఇదివరకు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీలు అయ్యేవి. కాకపోతే పరిస్థితి పూర్తిగా మారింది. ఫుడ్ డెలివరీ యాప్స్ కు బాగా గిరాకీ పెరుగడంతో ఫుడ్ ఆర్డర్ కోసం కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వీక్ ఎండ్స్ అయితే చెప్పక్కర్లేదు. వేచి ఉండాలిసిన సమయం మరీ ఎక్కువ సేపు పడుతుంది.

Also read: IPL: ఢిల్లీ యువ ఫేసర్ రసీఖ్ సలాంకు బీసీసీఐ మందలింపు

ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఫుడ్ ఆర్డర్లు మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు తాజాగా జొమాటో ‘ఫాస్ట్ డెలివరీ’ సేవలను మొదలు పెట్టనుంది. అయితే ఈ ఫాస్ట్ డెలివరీల కోసం ఫుడ్ ఆర్డర్ చేసిన వారు కాస్త సొమ్ము అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై, బెంగళూరు నగరాల్లోని సెలెక్టెడ్ ప్రాంతాల్లో ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీని ప్రయోగాత్మకంగా అమలు చేసింది జొమాటో. ఇందులో భాగంగా ప్రస్తుతానికి ముంబై, బెంగళూరు నగరాల్లోని కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్లను మాతరమే ఈ ఫీచర్‌ కు జత చేసింది జొమాటో.

Also read: Weather Update: రాష్ట్రాలకు చల్లటి వార్త చెప్పిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..!

కస్టమర్లు జొమాటో ప్లాట్ఫామ్‌ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడే ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీని ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్ ను తీసుకున్న కస్టమర్ల కోసం అదనపు చార్జీలు పే చేయాల్సి ఉండగా.. అయితే ఆర్డర్ బుక్ చేసిన కేవలం 21 నిమిషాల్లో డెలివరీ చేస్తే రూ.29 అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కొత్త ఫెసిలిటీ విజయవంతమైతే దేశమంతా అమలవుతుందని కంపెనీ భావిస్తోంది. ఇక ఇప్పటికే ప్లాట్ఫామ్ ఫీజు 25 శాతం పెంచడంతో.. కస్టమర్ ప్రతి ఆర్డర్ మీద అదనంగా మరో రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.

Exit mobile version