Site icon NTV Telugu

Deepinder Goyal: డెలివరీ బాయ్ అవతారమెత్తిన జొమాటో సీఈవో.. స్వయంగా తానే..!

Zomato

Zomato

జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ డెలివర్ బోయ్ అవతారమెత్తాడు. తానే స్వయంగా బైక్ పై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేశారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. ఆయన ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు, కస్టమర్లకు దీపిందర్ గోయల్ ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ ను పంపిణీ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోని దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

MLA Balanagi Reddy: చంద్రబాబుకు ఎప్పుడు ఒక పార్టీతో పొత్తు కావాలి.. పొత్తు లేకుంటే గెలవడం కష్టం

అందులో ఆయన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై జొమాటో టీ షర్ట్ ధరించి హెల్మెట్ పెట్టుకోవడం కనిపిస్తుంది. అంతేకాకుండా జొమాటో బ్రాండింగ్, ఫ్రెండ్ షిప్ కొటేషన్లతో కూడిన హ్యాండ్ బ్యాండ్ లను ఆయన పంపిణీ చేశారు. అప్పుడప్పుడు జొమాటో సీనియర్ ఉద్యోగులు స్వయంగా ఆర్డర్ల డెలివరీ పని చేస్తుంటారు. తద్వారా డెలివరీ భాగస్వాములు, కస్టమర్ల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. అయితే జొమాటో సీఈవో డెలివరీ బాయ్ గా అవతారమెత్తిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు

అంతేకాకుండా దీపిందర్ గోయల్ షేర్ చేసిన పోస్ట్ ను చూసి యూజర్లు ఉత్సాహంగా కామెంట్లు చేస్తున్నారు. చండీగఢ్ లో మీరు డెలివరీ చేస్తున్నారా? ఏదో ఒక రోజు మిమ్మల్ని నాకు డెలివరీ చేసే పార్ట్ నర్ గా చూస్తానని అనుకుంటున్నాను’’అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

Exit mobile version