Site icon NTV Telugu

Deepinder Goyal: మిస్టరీ పరికరంపై జొమాటో సీఈఓ సంచలన పోస్ట్..

Deepinder Goyal

Deepinder Goyal

Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ తాజాగా ఒక మిస్టరీ పరికరంపై సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. గతంలో ఆయన తన కొత్త ఆఫర్ అయిన ‘టెంపుల్’ అనే మెదడులో రక్త ప్రవాహ పర్యవేక్షణను పరిశీలించే పరికరం గురించి పోస్ట్ చేసిన తర్వాత ఆదివారం కొత్త పోస్ట్‌లో “త్వరలో వస్తుంది” అని పంచుకున్నారు. టెంపుల్ పరికరం అనేది “మెదడులో రక్త ప్రవాహాన్ని కచ్చితంగా, రియల్ టైం, నిరంతరం లెక్కించడానికి ఒక ప్రయోగాత్మక పరికరం” అని గోయల్ గతంలో పెట్టిన పోస్ట్‌లో వివరించారు. తాజాగా ఆయన ఈ పరికరం యొక్క చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని ఆయన గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు అభివృద్ధి చేసినట్లు సమాచారం.

READ ALSO: Big Relief for RCB Fans: ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు..

నవంబర్ 15న గోయల్ చేసిన వరుస పోస్ట్‌లలో ఆయన ఈ పరికరాన్ని “శాస్త్రీయమైన కానీ అసాధారణమైనది” గా వివరించారు. “నేను దీనిని ఎటర్నల్ CEOగా పంచుకోవడం లేదు, కానీ ఒక వింత థ్రెడ్‌ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా, మానవ దీర్ఘాయువుపై శాస్త్రీయ పురోగతి కోసం మా సాధారణ అన్వేషణలో భాగంగా మీతో పంచుకున్న. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని చెబుతున్నాను” అని ఆయన ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. తరువాత పోస్ట్‌లో ఆరోగ్యంపై గురుత్వాకర్షణ ప్రభావం గురించి తనకు ఉత్సుకత రేకెత్తించిన విషయాన్ని కూడా వివరించారు. “నేను నా ఆరోగ్యం, పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాను. నేను నా రక్తాన్ని ట్రాక్ చేయడం, ఉపవాసం ఉండటం, శిక్షణ పొందడం, ధ్యానం, మంచులో, హైపర్‌బారిక్ గదులలో కూర్చోవడం, అలాగే లెక్కలేనన్ని సప్లిమెంట్లను తీసుకోవడం చేశాను. ఆరోగ్యంగా ఉండటం కష్టం, దానికి చాలా సమయం పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ” నేను విస్మరించిన అంశం ఏంటో వెతుకుతూ నా మెదడును గందరగోళానికి గురి చేశాను. అన్ని జీవులలో స్థిరంగా ఉన్నది, మ్యుటేషన్ లేదా అనుసరణ ద్వారా తప్పించుకోలేనిది, స్పష్టంగా ఉన్నప్పటికీ కనిపించనిది ఏమిటి? అనేదానికి నా మనస్సులో ఒక పదం కనిపించింది,” అని ఆయన ఈ పోస్ట్‌లో జోడించారు. ఆదివారం సోషల్ మీడియాలో గోయల్ పోస్ట్‌కు మిశ్రమ స్పందనలను వెల్లువెత్తాయి. కొందరు ఈ టెంపుల్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎక్కడ లభిస్తుంది అని అడిగితే, మరికొందరు దాని వెనుక ఉన్న భావనను విమర్శించారు.

READ ALSO: Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..

Exit mobile version