Site icon NTV Telugu

Chandra Grahan 2023: పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రాశివారు ఎలాంటి నియమాలు పాటించాలంటే..?

Chandra Grahan 2

Chandra Grahan 2

Chandra Grahan 2023: ఈ రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది.. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది.. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. భారతదేశంతో పాటు ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం పడనుంది.

Read Also: IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!

అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా.. గ్రహణం ప్రభావం తప్పకుండా భారత్‌పై కూడా పడబోతోందని పండితులు చెబుతున్నారు. అందుకే గ్రహణ నియమాలను పాటించాలని చెబుతున్నారు.. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పౌర్ణిమకు వాల్మీకి జయంతి అనే పేరు కూడా ఉంది.. ఈ రోజు మరో విశేషం ఏంటంటే.. అదే చంద్రగ్రహణం.. అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఎలాంటి కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతుంది అంటున్నారు పండితులు.. ఇదే సమయంలో.. కొన్ని రాశులవారికి ఈ గ్రహణం అశుభ ఫలితాలను కూడా ఇస్తుందంటున్నారు.. మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడడడానికి శాస్త్రం అంగీకరించదు.. అశ్వనీ నక్షతం వారు కూడా చూడకూడదని చెబుతున్నారు.. మేషం, వృషభం, కన్యా, మకరం రాశుల వారికి ఈ గ్రహణం అశుభ ఫలితాలను అందించబోతుంది.. గ్రహణానికి ఎలాంటి కఠిన నియమాలు లేనప్పటికీ సాయంత్రం 4 గంటల వరకు భోజనాలు పూర్తి చేసుకోవాలి.. పూర్తిస్థాయిలో అంటే రాత్రి 8 గంటల లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.. ఇక.. ఏ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నియమాలు పాటించాలో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌చేయండి..

Exit mobile version