NTV Telugu Site icon

Zero Shadow day: ఈరోజు హైదరాబాద్ లో జీరో షాడో డే.. ఎన్నిగంటలకో తెలుసా..?

Zero Shadow Day, Hydrabad

Zero Shadow Day, Hydrabad

మన నీడ మనం ఎక్కడికి వెళ్లినా మన వెంటే ఉంటుంది. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకున్నా వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలు అయితే.. నీడతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. ఎప్పటికీ మన వెంటే ఉండే నీడ కొన్ని సందర్భాల్లో మాయమవుతుంది. మన నీడ మనకు కనిపించదంటే నమ్ముతారా? అవును ఇది నిజమే. చాలా మంది ఇప్పటికే దీని గురించి వినే ఉంటారు. అదే జీరో షాడో డే. ఆ అరుదైన సంఘటన ఇవాళ హైదరాబాద్‌లో జరగబోతుంది. గురువారం మిట్టమధ్యాహ్నం సమయంలో మన నీడ మాయం కాబోతుంది.

READ MORE: Cyber Crime: క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అని బెదిరించి రూ.1.48 కోట్లకు టోకరా.. ఎక్కడంటే..?

హైదరాబాద్‌లో జీరో షాడో డే మధ్యాహ్నం 12.12 గంటలకు జీరో షాడో ప్రారంభం అవుతుంది. ఈ జీరో షాడో డే ఏడాదికి రెండుసార్లు వస్తుందట. జీరో షాడో డే అంటే సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి, వస్తువు, లేదా ఇతరా ఏవైనా నీడ కనిపించదు. రెండు, మూడు నిమిషాల వరకు ఈ జీరో షాడో డే కొనసాగుతోంది. ఈ విషయాన్ని బీఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడించారు. అయితే.. జీరో షాడో డే కోసం.. తమ నీడ మాయం అయ్యే దృశ్యాన్ని చూసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే ఆత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదని చెబుతున్నారు. యువత ఈ రోజు కోసం ఎదురు చూస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే జీరో షాడో ఫొటోలు సోషల్ మీడియాను హోరెత్తించబోతున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి.