NTV Telugu Site icon

జీ తెలుగు ఆదివారం హంగామా

Bholaa Shankar Wtp & Drama Juniors 7 Grand Finale. Photo

Bholaa Shankar Wtp & Drama Juniors 7 Grand Finale. Photo

తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా సినిమా ‘భోళా శంకర్’ ను వరల్డ్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు చిన్న పిల్లల్లోని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. ఆలోచింపజేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ నటించిన భోళా శంకర్ సెప్టెంబర్ 15, ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు మరియు డ్రామా జూనియర్స్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 రాత్రి 9 గంటలకు, జీ తెలుగులో మాత్రమే.

జీ తెలుగు అందిస్తున్న ఆదివారం హంగామా మెగాస్టార్ మెగా మూవీ భోళా శంకర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్తో ప్రారంభం కానుంది. ఈ సినిమా కథ శంకర్(చిరంజీవి) అనే టాక్సీ డ్రైవర్అతని చెల్లెలు మహాలక్ష్మి(కీర్తి సురేష్) పాత్రలే ప్రధానంగా సాగుతుంది. చెల్లెలు చదువు కోసం శంకర్ కోల్కతాకు చేరుకుంటాడు. ఈ నేపథ్యంలోఅలెక్స్ (తరుణ్ అరోరా) నేతృత్వంలోని మాఫియా ముఠా నగరంలోని అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుండటంతో శంకర్ ఆ కిడ్నాప్ లలో ఒకదాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తాడుదాంతో అలెక్స్ శంకర్ పై పగ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందిశంకర్ ను అలెక్స్ చంపాడాఅసలు ఎవరీ శంకర్అతని గతం ఏమిటిఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే జీ తెలుగులో ఈ ఆదివారం మధ్యాహ్నం గంటలకు ప్రసారమయ్యే భోళా శంకర్ సినిమా చూసేయండి.

ఇకఆదివారం వినోదాన్ని కొనసాగిస్తూ జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ గ్రాండ్ ఫినాలే పార్ట్ ను రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనుంది. ఏడు సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. శ్రీరామ్ వెంకట్ యాంకర్గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ప్రీతి శర్మసౌందర్య మెంటర్లుగా వ్యవహరించారు. ఇకఈ సీజన్కి సినీ ప్రముఖులు పూర్ణబలగం వేణుజయప్రద న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ప్రతిభావంతులైన చిన్నారులు ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనలతో అలరించారు. ఈ గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఎపిసోడ్ కూడా యాంకర్జడ్జీలుకంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీతోపాటు ఎన్నో అద్భుతమైనస్కిట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది.

అంతేకాదు ఈ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా లవర్ బాయ్ తరుణ్ హాజరై విజేతలను ప్రకటించనున్నారు. మొదటిసారి బుల్లితెరపై తరుణ్ ఎంట్రీతో ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మరింత ప్రత్యేకంగా ప్రేక్షకులను అలరించనుంది. గ్రాండ్ ఫినాలేలో భాగంగా తరుణ్విక్టరీ వెంకటేశ్లపై స్పెషల్ స్కిట్స్కూతురు లక్ష్యాన్ని చేరుకోవడంలో తల్లిదండ్రులు పడే కష్టాలపై చేసే స్కిట్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. అన్ని

భావోద్వేగాల మధ్య గణేష్ పండుగ గురించి ఫన్నీ స్కిట్స్టైమ్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ స్కిట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సెప్టెంబర్ న మొదటి భాగంసెప్టెంబర్ న రాత్రి గంటలకు రెండవ భాగం ప్రసారం కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆదివారంవచ్చే ఆదివారం ఎపిసోడ్స్ తప్పకుండా చూడాల్సిందే.

అంతేకాదు మీ అభిమాన సీరియల్స్ మేఘసందేశంపడమటి సంధ్యరాగం ప్రత్యేక ఎపిసోడ్ మహాసంగమం సెప్టెంబర్ 14 తేదీల్లో రాత్రి గంటలకు ప్రసారం కానుంది. రెండు సీరియల్స్కు చెందిన నటీనటులు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోనున్నారు. జీ తెలుగు అందిస్తున్న ఈ వారాంతం వినోదాన్ని మీరు మిస్ కాకుండా చూసేయండి!

 

Show comments