Zebra Dhananjay: కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్ మల్టీ స్టారర్ గా నటించిన సినిమా ‘జీబ్రా’. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సినిమా ట్రైలర్ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా కన్నడ స్టార్ డాలీ ధనంజయ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
Read Also: Sarangapani Jathakam: ప్రియదర్శి హీరోగా నవంబర్ 21న ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల
జీబ్రాలో గ్యాంగ్ స్టర్, బ్యాంక్ అనే రెండు వరల్డ్స్ వున్నాయి. ఇందులో తనది పవర్ ఫుల్ ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ రోల్ అని తెలిపారు. సినిమా స్టోరీ అంతా బ్యాంక్ చుట్టూ తిరిగే ఆర్ధిక నేరాలు చుట్టూ ఉంటుందని, మనం చాలా ఫైనాన్సియల్ క్రైమ్స్ గురించి విని ఉంటామని ఆయన అన్నారు. ఓ కామన్ మ్యాన్ గా మనకి బ్యాంక్ లావాదేవీల గురించి అంత లోతుగా తెలియదని, అయితే ఈ సినిమా బ్యాంకింగ్ సిస్టం అందులోని ఫైనాన్సియల్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా దర్శకుడు ఈశ్వర్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథని రాశాడని అయన అన్నారు. మొత్తానికి సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని కన్నడ స్టార్ డాలీ ధనంజయ అన్నారు.
Read Also: Minister Nadendla Manohar: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా!
డైరెక్టర్ ఈశ్వర్ ఈ కథ చెప్పినపుడు నేను చాలా సప్రైజ్ అయ్యానని, ఫైనాన్సియల్ క్రైమ్ గురించి వింటా వుంటాం.. కానీ, అవి ఎలా జరుగుతాయో తెలీదనాని అన్నాడు. అయితే సినిమా కథ దర్శకుడు చెప్పినపుడు కళ్ళకు కట్టినట్టు కనిపించిందని, ఆయన బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చారని అన్నారు. పుష్ప సినిమాలోని ‘జాలి రెడ్డి’ పాత్ర నా కెరీర్ లో మెమరబుల్ అని, తెలుగు ప్రేక్షకులు మన జాలి రెడ్డి అని వోన్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆ పాత్రకు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమని మర్చిపోలేనని, తెలుగులో మరిన్ని సినిమాలు చేసి ప్రెకషకులని అలరించాలని వుందని ఆయన అన్నారు.