Site icon NTV Telugu

Zakia Khanam-BJP: వైసీపీకి రాజీనామా.. బీజేపీలో చేరిన జకియా ఖానం!

Zakia Khan Joins Bjp

Zakia Khan Joins Bjp

ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి జకియా ఖానం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం.. కొద్ది గంటల్లోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పార్థ సారధి పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన అనంతరం జకియా ఖానం మాట్లాడుతూ… ‘ప్రధాని న్రరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా అందరినీ తన బిడ్డలుగా భావించారు. వక్ఫ్ సంపదలో ముస్లిం పేదలు కూడా భాగస్వాములు కావాలని మోడీ ఆలోచించారు. బీజేపీలోకి వచ్చి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆలోచించాను. నన్ను చూసి ముస్లిం మైనారిటీలు బీజేపీలో మరింత మంది చేరాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ఈరోజు ఉదయం వైసీపీకి జకియా ఖానం రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను ఛైర్మన్‌కు పంపారు. జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్‌ నామినేట్‌ చేశారు. రెండేళ్ల నుంచి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో మంత్రి నారా లోకేష్‌ను జకియా ఖానం కలిశారు. దీంతో అప్పుడే ఆమె టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది. కానీ చివరకు బీజేపీలో చేరారు.

Exit mobile version