NTV Telugu Site icon

Zaheer Khan : టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్..?

Zaheer Khan

Zaheer Khan

Zaheer Khan : ప్రస్తుతం భారత క్రికెట్ లో అనేక పరిమణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తన బాధ్యతల నుంచి విరమించుకున్నారు. గత కొద్ది కాలం ముందే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ టి20 వరల్డ్ కప్ దృష్ట్యా అతని పోస్టింగ్ సమయాన్ని మరింతగా పొడిగించారు. ఇకపోతే తాజాగా టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ సంతోషంగా హెడ్ కోచ్ పోస్ట్ నుంచి బయటికి వచ్చేసారు. ఇక ఈ పదవి కోసం బిసిసిఐ చాలా కాలం నుంచి అధికారిక ప్రటన విడుదల చేసింది. అప్పుడు నుంచి అనేక పేర్లు బయటకు వస్తూనే ఉండగా.. చివరికి టీమిండియా మాజీ ప్లేయర్ డేరింగ్ పర్సన్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ సెక్రెటరీ జైషా కోచ్ పదవి సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. గౌతమ్ గంభీర్ కు బిసిసిఐ నుండి అన్ని విధాలుగా సహకారం లభిస్తుందని ఆయన తెలిపాడు.

Anant Radhika Wedding : 100 ప్రైవేట్ విమానాలు, 3 ఫాల్కన్ జెట్ విమానాలు.. అతిథుల కోసం అంబానీ ప్లాన్

ఇకపోతే గంభీర్ నియామకం చేసే ముందు రోజే రాహుల్ ద్రావిడ్ ను పొగడ్తలతో ముంచేశాడు కెప్టెన్ రోహిత్. దీంతో కొత్త హెడ్ కోచ్ సమయం ఆసన్నమైందని అందరికీ అర్థమైంది. అందుకు తగ్గట్టుగానే.. గంటల వ్యవధిలోని బిసిసిఐ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అలాగే హెడ్ కోచ్ తో పాటు మొత్తం కోచింగ్ స్టాఫ్ ను మార్చాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గౌతమ్ గంభీర్ కు ఆప్షన్స్ ఇచ్చిందని సమాచారం. ఇందులో భాగంగానే గౌతం కోల్కత్తా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ ను టీమిండియా కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Motkupalli Narasimhulu: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది.. మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్..

ఇకపోతే ముఖ్యంగా బౌలింగ్ కోచ్ పదవికి భారత మాజీ ఆటగాడు లెజెండ్ జహీర్ ఖాన్ ను తీసుకురావడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి జహీర్ ఖాన్ కూడా బౌలింగ్ కోచ్ రేసులో ఉన్నట్లుగా అర్థమవుతుంది. జహీర్ ఖాన్ టీమిండియాకు సేవల అందించేందుకు సుముకతగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పదవికి టీమిండియా మాజీ ఆటగాడు లక్ష్మీపతి బాలాజీని కూడా తీసుకోవాలని కొందరు బోర్డు పెద్దలు భావించారట. దింతో ఇప్పుడు చివరికి బాలాజీ లేదా జహీర్ ఖాన్ ఎవరో ఒకరు టీమిండియా శ్రీలంక సిరీస్ కు వెళ్లేముంది డిసైడ్ కానుబోతున్నారు. చూడాలి మరి చివరికి కొత్త బౌలింగ్ కోచ్ గా ఎవరు వస్తారు అన్నది.