స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుండగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. అయితే, చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
Read Also: Moon Earthquakes: చంద్రుడిపైన భూకంపాలు వస్తాయా? వాటి తీవ్రత ఎలా ఉంటుంది?
చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే గత నాలుగేళ్లు పట్టేదా అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కక్ష సాధింపు చర్యలు చేపట్టే వాళ్లమని ఆయన పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం కోసం కేటాయించిన కోట్లాది రూపాయలలో అవినీతి జరిగిందని అసెంబ్లీలోనే సీఎం జగన్ ప్రస్తావించారు.. సెల్ కంపెనీలకు నగదు బదలాయించి ఎలా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: Rajasthan: “మహిళ నకిలీ రేప్ స్టోరీ”.. నిజం తెలిస్తే భర్త వదిలేస్తాడనే భయంతో..
అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు అయ్యారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. చట్టం ముందు అందరూ సమానులేనంటూ ఆయన వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే కనీసం ప్రజలు స్పందించడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయనపై ప్రజలకు ఎంత కోపం తెలుస్తుంది.. అలాంటిది ఆయనకు కోర్టే సరైన శిక్ష విధిస్తుంది.. అయినా చంద్రబాబుకు కోర్టులను మెనేజ్ చేయడం కొత్తేం కాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.