NTV Telugu Site icon

Dhanashree Verma: మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు.. మనుషులుగా ఆలోచించండి! చహల్‌ సతీమణి ఫైర్

Dhanashree Verma Pratik

Dhanashree Verma Pratik

Dhanashree Verma React on Viral Photo with Pratik Utekar: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనశ్రీ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన భర్త చహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. తాజాగా హిందీ పాపులర్ డ్యాన్స్ షో ‘జలక్ దికలాజా’లో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగారు. ఫైనల్‌లో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌తో ధనశ్రీ అత్యంత సన్నిహతంగా ఉన్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

తాజాగా ట్రోల్స్‌పై స్పందించిన ధనశ్రీ వర్మ ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో విడుదల చేశారు. అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు మనుషులుగా ఆలోచించండి అని ఫైర్ అయ్యారు. ‘ఏదైనా అడగడం చాలా సులువు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు మనుషులగా ఆలోచించండి. నేను నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్స్‌, మీమ్‌ల బారిన పడలేదు. నేను వాటిని పట్టించుకోను. కొన్నిసార్లు వాటిని చూసి నవ్వుకుంటాను. అయితే ఇప్పుడు ఈ చెత్త ట్రోల్స్‌పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే అవి నా కుటుంబం, సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి’ అని ధనశ్రీ అన్నారు.

Also Read: IPL 2024: ఐపీఎల్‌ ఎక్కడికీ పోదు.. పూర్తిగా భారత్‌లోనే!

‘మీ అందరికీ సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేసి.. మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. నా పనిలో సోషల్ మీడియా భాగం కాబట్టి నేను దాన్ని విడిచిపెట్టలేను. ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి రావడానికి నేను ఈరోజు ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. మిమ్మల్ని అలరించడానికే సోషల్‌ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి. నేను ఓ పోరాట యోధురాలిని. ఏ విషయానికి వెనకడుగు వేయను. మంచి విషయాలపై దృష్టి పెట్టి.. మీ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నా’ అని ధనశ్రీ వర్మ చెప్పుకోచ్చారు.

Show comments