Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్‌గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!

Yuzvendra Chahal Joins Bjp

Yuzvendra Chahal Joins Bjp

Chahal-Dhanashree: స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బీజేపీ ‘నేషనల్ ఓబీసీ మోర్చా’ (National OBC Morcha) ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయనను స్పెషల్ ఇన్వైటీగా నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ఈ బాధ్యతలు అప్పగించి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు చహల్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో (Amarpal Maurya) భేటీ అయ్యారు.

ఒకవైపు చహల్ ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టగా, మరోవైపు ఆయన మాజీ భార్య (Ex-wife) ధనశ్రీ వర్మ (Dhanashree Verma) కూడా తన కెరీర్‌లో ఓ పెద్ద స్టెప్ వేసింది. ఆమె ‘హే కన్నమ్మ’ (Hey Kannamma) అనే తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమాతో హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అవుతోంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ధనశ్రీ తన డెబ్యూ గురించి మాట్లాడుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నిన్నటి రోజు తనకు చాలా హంబుల్‌గా, అందంగా భావోద్వేగానికి గురిచేసేలా గడిచిందని ఆమె రాసుకొచ్చింది. తమ ట్రైలర్‌కు ఇంత ప్రేమ, అదిరిపోయే రెస్పాన్స్ రావడం వల్ల ఈ జర్నీ ఇంకా స్పెషల్‌గా అనిపించిందని పేర్కొంది. ఇది టీమ్‌వర్క్, ప్యాషన్, ఈ ప్రాజెక్ట్‌ను నిజం చేయడానికి కలిసిన వాళ్లందరి సెలబ్రేషన్ అని చెప్పింది. తెలుగు మీడియా (Telugu Media), ఇండస్ట్రీ (Industry) చూపించిన ప్రేమకు చాలా థాంక్స్ చెబుతూ, ఎన్నో జ్ఞాపకాలు, ఎమోషన్స్‌తో నిండిన హృదయంతో ముందుకు వెళ్తున్నానని, ‘హే కన్నమ్మ’ తనకు చాలా ప్రత్యేకం అని పేర్కొంది. ఇక, మొత్తానికి విడాకుల తర్వాత ఈ మాజీ జంట ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై ఫోకస్ (Focus) చేస్తూ బిజీగా ఉన్నారు.