NTV Telugu Site icon

Yuzvendra Chahal: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి చూడండి.. చాహల్‌ సంచలన పోస్టు

Yuzvendra Chahal

Yuzvendra Chahal

Yuzvendra Chahal: భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కొత్త స్నేహితురాలితో మైదానంలో సందడి చేసిన చాహల్, ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్‌కు సిద్ధమవుతూ ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు చాహల్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.18 కోట్లు భారీగా వెచ్చించి పంజాబ్ ఫ్రాంచైజీ చాహల్‌ను తమ జట్టులోకి తీసుకుంది. దీనితో, ఈ లెగ్ స్పిన్నర్ పై అభిమానులు భారీగా అసలు పెట్టుకున్నారు అభిమానులు.

Read Also: USA-India Tariffs: అమెరికా ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన వైట్ హౌస్

ఇకపోతే, చాహల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో పంజాబ్ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌కు ఓ సందేశం పంపాడు. “రికీ… ఓపెనింగ్‌లో ఏవైనా స్థానాలు ఖాళీగా ఉన్నాయా?” అంటూ ఓ వీడియోను జత చేసి పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అతను పోస్ట్ప చేసిన వీడియోలో ప్రాక్టీస్‌కు వెళ్లే క్రమంలో చాహల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తనను పరిగణించాలంటూ పాంటింగ్‌ను అడిగాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారతదేశానికి చెందిన మూడు కీలక ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకోవాలని అనుకున్నట్లు పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. మెగా వేలంలో నేను ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను మా జట్టులోకి తీసుకోవాలని బలంగా అనుకున్నని.. అర్ష్‌దీప్ సింగ్‌ను గత నాలుగేళ్లుగా మా జట్టులో ఉన్నాడని, శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం మా కోసం ప్రధాన లక్ష్యంచేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇక మూడో కీలక ఆటగాడు చాహల్. ఈ ముగ్గురితో జట్టు మరింత బలంగా ఉంటుందని పాంటింగ్ పేర్కొన్నాడు.

మొత్తానికి ఇప్పటివరకు చాహల్‌ భారత జట్టుకు స్పిన్నర్‌గా సేవలు అందిస్తున్నాడు. కానీ, ఈసారి ఐపీఎల్‌లో కొత్త పాత్రలో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, నిజంగా పంజాబ్‌ జట్టు ఓపెనర్‌గా అవకాశం ఇస్తుందా? లేక ఇది కేవలం సరదా వ్యాఖ్య మాత్రమేనా అనేది చూడాలి.