NTV Telugu Site icon

Yuvraj Singh : సూరీడు మళ్లీ చెలరేగుతాడు.. వరల్డ్ కప్ లో అతనిదే కీలక పాత్ర..

Yuvaraj Singh

Yuvaraj Singh

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ దెబ్బకు ఎల్బీగా సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మూడో వన్డేలో అష్టన్ అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తవ్వగా.. సహచర ఆటగాళ్లు, క్రికెట్ దిగ్గజాలు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్ సైతం సూర్యకు మద్దుతుగా ట్వీట్ చేశాడు. ప్రతీ క్రీడలో ప్రతీ ప్లేయర్ తమ కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కోవడం సర్వసాధారణం. ఒకానొక దశలో మేం కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించామని యువరాజ్ సింగ్ తెలిపాడు.

Also Read : Fire accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కారులోనే సెక్యూరీటి గార్డ్ సజీవ దహనం

అవకాశం వస్తే ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం తనకు ఉందని.. మన ప్లేయర్లకు మనం మద్దతుగా నిలుద్దాం.. సూర్య మళ్లీ తన ఆటతో ఉదయిస్తాడు అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సూర్యకుమార్ యాదవ్ కు అండగా నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వైఫల్యాన్ని మరిచిపోయి ఐపీఎల్ లో చెలరేగాలని గవాస్కర్ సూచించారు. ప్రతీ ఆటగాడి కెరీర్ లో ఇలా వైఫల్యమవ్వడం సాధారణమని, ఎక్కువగా ఆలోచించకుండా పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాలని సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. అలా చేస్తే ఈ జరుగబోయే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.

Also Read : Wedding Procession : పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ సిరీస్ లో సూర్య మూడు బంతులే ఆటడం దురదృష్టకరమని, మూడు అద్భుతమైన బంతులకు సూర్య ఔటయ్యాడని రోహిత్ శర్మ వెనకేసుకొచ్చాడు. వరుసగా గోల్డెన్ డకౌట్ లు అయినంత మాత్రానా అతని సామర్థ్యం, నైపుణ్యాలు ఎక్కడికీ పోవని చెప్పుకొచ్చాడు. వరుసగా మూడు వన్డేలలో సూర్య డకౌట్ కావడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ఇంకా సంజూ ఏం చేయాలి.. అని ప్రశ్నించాడు.. ఇప్పటికైనా టీమ్ లో అతన్ని ఆడించాలని సూచించాడు. దీనికి కౌంటర్ గా టీమిండియా దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ రియాక్ట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ కే తను మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. సూర్యతో సంజూను పోల్చొద్దని, ఎవరి టాలెంట్ వాళ్లదే అని చెప్పాడు. మెరుగైన ప్రదర్శన చేసేవాళ్లకే టీమ్ మేనేజ్మెంట్ అవకాశాలను అందిస్తుందని కపిల్ దేవ్ వెల్లడించారు. ఒక వేళ సంజూకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే అప్పుడు ఎవరిని నిందించే వారని ఆయన ప్రశ్నించాడు.