Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల సోషల్ మీడియా ప్రవర్తనపై కాస్త గట్టిగానే స్పందించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ హరిప్రీత్ బ్రరర్ తన సహచరులు ప్రియాంష్ ఆర్య, అర్షదీప్ సింగ్ లతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోకు “స్లాగర్ అండ్ వ్లాగర్” అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా స్పందించారు.
అయితే అందరిలో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది మాత్రం యువరాజ్ సింగ్ కామెంట్. “తుహాడే సారియాన్ దే చప్పలాన్ దా టైమ్ హో గయా హై హుణ్” అంటూ పంజాబీలో కామెంట్ చేశాడు యూవీ. అంటే దీనికి అర్థం “ఇప్పుడైతే మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది” అనే అర్థంలో వార్నింగ్ ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. యువరాజ్ చేసిన ఈ వ్యాఖ్యను అభిమానులు “టఫ్ లవ్”గా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా మునిగిపోకుండా, ఆటపై దృష్టి పెట్టాలని యువ ఆటగాళ్లకు సూచించినట్లుగా భావిస్తున్నారు.
ఇటీవల పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల సోషల్ మీడియా పోస్టులు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియా యాక్టివిటీస్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. తిలక్ వర్మ, ప్రియాంశ్ ఆర్యలతో అతని ఆన్‌లైన్ సరదా సంభాషణలు కూడా వైరల్ అయ్యాయి. ఇక యువరాజ్ కామెంట్ తర్వాత అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ.. “సీనియర్లు చెప్పేది వినాలి”, “యువీ పాజీ స్టైల్ ఇదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Yuvraj Singh – unable to control his emotions 😜😜😜 pic.twitter.com/1vA5QjR8MA
— The King 👑 (@lordkings_x) May 24, 2026
