Site icon NTV Telugu

Yuvraj Singh: “నాకు సపోర్ట్, రెస్పెక్ట్ రెండూ లేవు”.. రిటైర్మెంట్‌కు అసలు కారణాన్ని వెల్లడించిన యువరాజ్

Yuvraj Singh

Yuvraj Singh

Yuvraj Singh: యువరాజ్ సింగ్ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక ఫైటర్ కనిపిస్తాడు. మైదానంలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌ల్లో పెద్ద షాట్లకు యువరాజ్ ప్రసిద్ధి. కానీ ఆ హీరో వెనక దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. తాజాగా సానియా మీర్జాతో ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ తన మనసులోని మాటలను తొలిసారి ఓపెన్‌ అయ్యాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలోనే యువరాజ్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఈ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ వెల్లడించాడు.

READ MORE: Yuvraj Singh: మ్యాచ్ సమయంలో అమ్మాయికి హాగ్, వివాదం.. అసలు విషయం చెప్పిన యువరాజ్!

2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత యువరాజ్‌ను జట్టులోకి తీసుకోలేదు. ఎవరూ తనతో మాట్లాడటం లేదన్న బాధ కలిగిందట. ఎవరూ తన ఆటను గౌరవించడం లేదని బాధ పడ్డాడట. సపోర్ట్ లేదు, రెస్పెక్ట్ లేదని వెల్లడించాడు. అంతేకాదు.. శారీరకంగా, మానసికంగా అలసిపోయినట్లు అనిపించిందట. ఆడటంలో ఆనందం, గౌరవం లేకపోతే ఆ ఆటను వదిలేయడమే మంచిదని తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాన్ని యువరాజ్ బయటపెట్టాడు. భవిష్యత్తులో సెలెక్షన్ కమిటీ లేదా అడ్మినిస్ట్రేషన్‌లోకి వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం తన పిల్లలే తన ప్రపంచం అని, వాళ్లతో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో కోచ్‌గా లేదా మెంటర్‌గా యువ ఆటగాళ్లతో పని చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. అంతేకాదు.. తనకు చిన్నప్పుడు తాను క్రికెటర్ కావాలని కోరుకోలేదట. టెన్నిస్, రోలర్ స్కేటింగ్ అంటే చాలా ఇష్టమని యువరాజ్ తెలిపాడు. క్రికెట్ తన మీద రుద్దబడిందని చేదు నిజాన్ని వెల్లడించాడు. తండ్రి యోగరాజ్ సింగ్ ఒక దశలో తండ్రికన్నా కోచ్‌లా మారిపోయారని చెప్పాడు.

READ MORE: Gongura Pulihora Recipe: నోట్లో నీళ్లు తెప్పించే గోంగూర పులిహోర.. సులువుగా ఇలా చేసేయండి అంతే.!

Exit mobile version