Site icon NTV Telugu

Yuvraj Singh: ఐపీఎల్‌లో చీఫ్ కోచ్‌గా మారబోతున్న యువరాజ్ సింగ్ .. ఏ జట్టుకో తెలుసా!

Yuvraj Singh

Yuvraj Singh

Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొత్త పాత్రలోకి ప్రవేశించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఆయన ఐపీఎల్‌లో ఒక జట్టుకు చీఫ్ కోచ్‌గా మారనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయనను నియమించడానికి యూవీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన జట్టుకు భారతీయుడిని ప్రధాన కోచ్‌గా నియమించాలనుకుంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఎస్‌జి టీంకు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఉన్నారు.

READ ALSO: Montha Effect : ఏపీని ముంచిన మొంథా.. ఎన్ని కోట్ల నష్టమంటే..?

యూవీతో LSG చర్చలు..
పలు నివేదికల ప్రకారం.. యువరాజ్ సింగ్ – LSG మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఒప్పందం ఖరారైతే ఇది IPL చరిత్రలో ఒక ప్రధాన కోచింగ్ చర్య మారుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువరాజ్ ఒక ప్రొఫెషనల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయకపోయినా, ఆయన అబుదాబి T10 లీగ్‌లో మెంటర్‌గా పనిచేశాడు. అలాగే ఆయన చాలా కాలంగా శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి యువ ప్రతిభావంతులకు శిక్షణ ఇస్తున్నాడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే యువరాజ్ సింగ్ పేరు ఐపీఎల్ జట్టుతో ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (జిటి)తో ఆశిష్ నెహ్రా విడిపోతే, ఆయన స్థానంలో యువరాజ్ సింగ్‌ తాత్కాలిక బాధ్యతలు తీసుకున్నట్లు పలు నివేదికలు వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) కూడా యువరాజ్ సింగ్‌ను రికీ పాంటింగ్ స్థానంలో కోచ్‌గా నియమించాలని చర్చించింది, కానీ చివరికి హేమాంగ్ వదానిని చీఫ్ కోచ్‌గా నియమించారు. 2022లో IPLలోకి అడుగుపెట్టిన LSG, మొదటి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది కానీ ఆ తర్వాత రెండుసార్లు ఏడో స్థానంలో నిలిచింది. దీని ఫలితంగా జట్టులో అనేక మార్పులు వచ్చాయి.

READ ALSO: Children Hostage Mumbai: ముంబైలో సంచలన ఘటన.. బందీలుగా ఉన్న 20 పిల్లల రెస్క్యూ

Exit mobile version