NTV Telugu Site icon

Yuvraj-Broad: అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడం నా అదృష్టం.. లేదంటే 7 సిక్స్‌లు కొట్టేవాడు

Brod

Brod

గ్రేట్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్‌లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ క్రమంలో బ్రాడ్ స్పందించాడు. అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడని బ్రాడ్ చెప్పాడు.

Read Also: Pawan Kalyan: శ్రీవారికి అపచారం.. 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

స్కై స్పోర్ట్స్‌లో టీ20 ప్రపంచ కప్ 2007లో జరిగిన హైలైట్స్‌ను వీక్షించాడు బ్రాడ్. అనంతరం మాట్లాడుతూ.. అంపైర్ తన బాల్‌లో ఒకటి నో బాల్ అని ఇస్తే ఏడో సిక్స్‌ కూడా కొట్టేవాడని అన్నాడు. మొదటి మూడు బంతుల్లో వికెట్ మీదుగా బౌలింగ్ చేయగా మూడు సిక్సర్లు కొట్టాడని.. నాల్గవ బంతిని వికెట్ దగ్గరికి వేసినా.. సిక్సర్ బాదాడని చెప్పాడు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఒక బంతి నడుము వరకు వేశానని, అది అంపైర్ నో బాల్ ఇస్తాడని అనుకున్నట్లు బ్రాడ్ చెప్పాడు. ఒకవేళ నోబాల్ ఇస్తే.. యువరాజ్ ఏడో సిక్సర్ కొట్టేవాడని అన్నాడు. ‘నేను ఇంతటి బ్యాటింగ్ చూడలేదు, నో బాల్ ఇవ్వకపోవడం నా అదృష్టం. లేకుంటే యువీ ఏడో సిక్స్ కూడా కొట్టేవాడు.’ అని పేర్కొన్నాడు. ఆరు సిక్సర్ల వీడియోని తాను ఇంతవరకు చూడలేదని బ్రాడ్ చెప్పాడు.

Read Also: Israel-Hamas war: గాజా ఆశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి

ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. గంభీర్ 41 బంతుల్లో 58 పరుగులు, సెహ్వాగ్ 52 బంతుల్లో 68 పరుగులు, యువీ 16 బంతుల్లో 58 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కాగా.. ధోనీ నేతృత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.