NTV Telugu Site icon

Yuvan Shankar Raja : దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్న మ్యూజిక్ డైరెక్టర్

New Project 2024 10 18t083041.803

New Project 2024 10 18t083041.803

Yuvan Shankar Raja : యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ఇప్పటి వరకు ఆయన సంగీతంలో విడుదలైన పాటలన్నీ మెగా హిట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా తాజాగా దళపతి విజయ్ నటిస్తున్న “గోట్” సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేశారు. సినిమా ఇండస్ట్రీలోకి ఇళయరాజా తనయుడిగా అడుగు పెట్టిన యువన్ శంకర్ రాజా.. తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకున్నాడు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లో టాప్‌ కంపోజర్ గా ఎదిగారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఏఆర్ రహమాన్‌ స్థాయి అంటూ ఒకానొక సమయంలో ప్రశంసలు దక్కించుకున్న ఆయన ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నారు. త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడు. తనకు అత్యంత సన్నిహితుడు అయిన శింబు హీరోగా సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

Read Also:Viral Video: దేవుడా.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు

గతంలో నిర్మాతగా ప్యార్‌ ప్రేమ కాదల్‌ సినిమాను నిర్మించాడు యువన్ శంకర్ రాజా. ఆ తర్వాత సైతం పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్న యువన్ శంకర్ రాజా ఇప్పుడు దర్శకుడిగా సినిమాను చేయడం ద్వారా మరోసారి తనలో మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యువన్‌ శంకర్‌ రాజా మాట్లాడుతూ సంగీతంపైనే కాకుండా కథలపైన వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే శింబు హీరోగా ఒక సినిమాను చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాడు. శింబుకు ఇప్పటివరకు చెప్పలేదని యువన్ అన్నారు. అయితే యువన్‌ శంకర్‌ రాజా తో శింబుకు చాలా మంచి స్నేహం ఉంది. అందుకే ఆయన ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వీరి కాంబో మూవీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

Read Also:Nitin Gadkari: వచ్చే రెండేళ్లలో రవాణా ఖర్చులు మరింత తగ్గనున్నాయి..

Show comments