Site icon NTV Telugu

Yuvagalam Vijayotsava Sabha: నేడు యువగళం విజయోత్సవ సభ.. పాల్గొననున్న టీడీపీ, జనసేన శ్రేణులు

Yuvagalam

Yuvagalam

Yuvagalam Vijayotsava Sabha: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ నేడు జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను టీడీపీ శ్రేణులు నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇరు పార్టీల శ్రేణులు పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా పాల్గొననున్నాయి.

Read Also: Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత భయం.. అప్రమత్తమైన టీటీడీ

అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. 8 అడుగుల ఎత్తులో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో 600 మంది ముఖ్య నేతలు కూర్చునేలా స్టేజ్ ఏర్పాటు చేశారు. స్టేజ్‌పై భారీ డిజిటిల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. 6 లక్షల మందికి సరిపడా గ్యాలరీలు సిద్ధం చేశారు. పార్కింగ్‌కు 50 ఎకరాల స్థలం కేటాయించారు. సభ నిమిత్తం నారా లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. సభ కోసం బుక్ చేసుకున్న రైళ్లలో టీడీపీ శ్రేణులు జిల్లాకు చేరుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు రైళ్లలో పెద్ద ఎత్తున సభ వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. సభ నిర్వహణకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

Exit mobile version