Samajika Sadhikara Bus Yatra: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తూ.. అధికార పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలు ఏడో రోజుకి చేరాయి.. ఒకే సారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్రలు సాగుతున్నాయి.. ఆయా వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరిస్తూ.. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. ఉపన్యాసాలు చేస్తున్నారు.. ఇప్పటికే ఆరు రోజుల పాటు సాగిన సామాజిక సాధికార యాత్ర.. ఈ యాత్ర ఏడో రోజులో భాగంగా సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు..
Read Also: Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. మియాన్‌వాలీ ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించి భీకర కాల్పులు
ఇక, ఆయా నియోజకవర్గాల్లో జరిగే ఈ యాత్రల్లో ఎవరు పాల్గొంటారు.. యాత్ర ఎలా సాగుతుందనే వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లాలో ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభంకానుంది.. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహిస్తారు.. ఆ తర్వాత మీడియా సమావేశం.. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఉండనుంది.. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఇతర వైసీపీ నేతలు పాల్గొనున్నారు. మరోవైపు.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మధ్యాహ్నం 2:45 గంటలకు సంగడిగుంట వైఎస్సార్ విగ్రహం నుంచి మాయాబజార్ వరకు యాత్ర కొనసాగనుంది. అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారు.. ఇక విజయనగర జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొంటారు..