Samajika Sadhikara Bus Yatra Day 16th: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరిస్తూ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.. తొలి విడుదల రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించి.. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ రెండో దశలో ఈ బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇలా ఇవాళ్టితో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 16వ రోజుకు చేరింది.. ఈ రోజు విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర సాగనుంది..
Read Also: Jagapathi Babu : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న జగ్గు భాయ్ ..?
విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగనుండగా.. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తదితర నేతలు పాల్గొననున్నారు. ఆరిలోవ లాస్ట్ బస్టాప్ దగ్గర నుంచి ఏఎస్ రాజా గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. నాడు నేడులో తోట గురువు హైస్కూల్లో పనులను పరిశీలించనున్నారు నేతలు.. ఏఎస్ రాజా గ్రౌండ్ లో బహిరంగ సభ జరగనుంది.. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా.. తణుకు వి మాక్స్ థియేటర్ ఏరియా నుంచి తణుకు నరేంద్ర సెంటర్ వరకు బైక్స్ ర్యాలీ నిర్వహిస్తారు.. అనంతరం నరేంద్ర సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది.. మరోవైపు.. కర్నూలు జిల్లా పత్తికొండలో వైయస్సార్ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు పాల్గొననున్నారు.