MP Vijayasai Reddy: ఎస్సీలను కొందరు రెండు వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు.. వైసీపీకి అందరూ సమానమే అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు నేతలు.. వైసీపీలో చేఆరు.. వేమూరు నియోజకవర్గం చుండూరు, అమర్తలూరు, భట్టిప్రోలు మండలాల్లోని ఇతర పార్టీలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి.. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీచేయాలనేది సిద్ధాంతమని స్పష్టం చేశారు.
Read Also: Alla Ramakrishna Reddy Back To YSRCP: అందుకే మళ్లీ వైసీపీలో చేరా.. మూడోసారి విజయం మాదే..!
ఇక, మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకునే టీడీపీని నమ్మొద్దని సూచించారు విజయసాయిరెడ్డి.. అయితే, కేంద్ర ప్రభుత్వ సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్దతు పలికామని తెలిపారు. త్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకలేదని గుర్తుచేసిన ఆయన.. సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు సపోర్టు చేయలేదన్నారు. మతతత్వ పార్టీలతో ఎప్పుడూ వైసీపీకి పొత్తు ఉండదూ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.