Site icon NTV Telugu

Mopidevi Venkataramana :చంద్రబాబువి అడ్డగోలు ప్రయత్నాలే

Mp Mopidevi

Mp Mopidevi

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కామెంట్లపై మండిపడ్డారు మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ. కర్నూలులో రాజధానికి నేను వ్యతిరేకం కాదు అని మాట్లాడుతున్నచంద్రబాబు రాయలసీమ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కర్నూలు రాజధానికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడిన సాక్షాలు ఎన్నో వున్నాయి. రాజధాని అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.. దానిని నిలబెట్టుకోవడం కోసం అడ్డగోలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేశారు.

తన బినామీలు ఏజంట్లతో చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించాడు. హైకోర్టు కూడా పాదయాత్ర సరైన విధానం కాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పనిచేస్తున్న ఎమ్మెల్యే లు ఎంపీ లు అందరూ కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి.చంద్రబాబు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఎంపీ మోపిదేవి.

Read Also: Koo: ట్విట్టర్‌కు పోటీగా స్వదేశీ యాప్ .. అమెరికాలో లాంచ్ కానున్న “కూ”

మరోవైపు మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబుపై తీవ్రమయిన విమర్శలు చేశారు. సానుభూతి ద్వారా రాజకీయాలు చేయడానికి వైయస్‌ జగన్‌కు ఉన్న అవకాశం ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడికి లేదన్నారు మంత్రి అప్పలరాజు. అందులో ఒక 10 శాతం, 5 శాతం, ఒక్క శాతం కూడా సానుభూతి కోసం పాకులాడకుండా ఒక్కడిగానే నిలిచాడు. ప్రజల కోసం, పార్టీ కోసం, కుటుంబం కోసం, తన మనుషుల కోసం ఎదురొడ్డి నిలిచాడు వైయస్‌ జగన్‌. ఈ రోజు ఒంటరిగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా గెలిచాడు. చంద్రబాబు ఇది నీకు చేతనవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

Read Also: Shraddha Walkar Case: శ్రద్ధా హత్య కేసులో కీలకంగా మారిన “వాటర్ బిల్”..

Exit mobile version