Site icon NTV Telugu

MP comments On Pawan Kalyan: కేఏ పాల్ లాంటోడే పవన్ కల్యాణ్.. పెద్ద తేడా ఏం లేదు

Mp

Mp

MP comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్ మాటలు ప్రజలు నమ్మరని.. ఆయన కూడా కేఏ పాల్ లాంటి వాడేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత మాట్లాడుతున్న తీరు యువతను పెడదోవ పట్టించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ 651లే అవుట్లలో నిర్మించిన 79వేల ఇళ్లను పరిశీలించారు. ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారన్నారు.

Read Also: GVL Clarity on YSRCP Alliance: టీడీపీ, వైసీపీలకు బీజేపీ ఎప్పటికీ దూరమే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ

ఈ రోజు పవన్ నా మీద కేసులున్నాయి. మీ మీద కేసులు వచ్చినా పోరాడండి అంటూ యువతని రెచ్చగొట్టడంలో అర్థమేంటి అని ప్రశ్నించారు. ఆయనను ప్రజలు కేవలం ఒక సినిమా నటుడిగానే చూస్తారు కానీ రాజకీయ నాయకుడిగా గుర్తించడంలేదని తెల్సుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేకుండా భారీగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Exit mobile version