MLA Reddy Shanthi: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంచి, మన అకౌంట్లలో డైరెక్టుగా సంక్షేమ పథకాలు వేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆమె పేర్కొన్నారు. తెలుగుదేశం గజదొంగల ముఠా ఈ ప్రాంత ప్రజల సొమ్ములు దోచుకున్నారని మండిపడ్డారు. వారికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. తప్పడు మాటలు, అబద్దపుమాటలు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు… నమ్మకండి అంటూ ఆమె ప్రజలకు సూచించారు. మన పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాలలో ఉన్న వారిలో కొనుగోలు శక్తి పెంచిన ఘనత మన జగన్ దేనన్నారు. ఎవరైనా తప్పడు మాటలు మాట్లాడితే వారి నోటికి చురక పెట్టాలన్నారు.
Read Also: Dharmana Prasada Rao: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి..
18 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో బీసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారని చెప్పారు. ఒడిశాకు మనకు అనుసంధానంగా కొరసవాడ వద్ద 8 నెలల కాలంలో 11 కోట్లతో బ్రిడ్జి నిర్మించిన నేత మన జగన్ అంటూ ఎమ్మెల్యే అన్నారు. వంశధార నిర్వాసితుల కష్టార్జితాన్ని ఇక్కడ తెలుగుదేశం నేత కలమట రమణమూర్తి దోచుకున్నాడని ఆమె విమర్శించారు. 216 కోట్లు అదనపు పరిహారం వంశధార నిర్వాసితులకు అందించామన్నారు. నాడు నేడు కింద మన నియోజకవర్గంలో అన్ని పాఠశాలలు నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. మన హిరమండలం నుండి ఉద్దానం ప్రాంత కిడ్ని వ్యాధుగ్రస్తుల కోసం మంచి నీటి కోసం 716 కోట్లతో ఇస్తున్నామన్నారు. మన 5 మండలాలలో ప్రజలకు కూడా వంశధార నీటిని 245 కోట్ల రూపాయలతో ప్రత్యేక నీటిని అందిస్తున్నామని.. నా ఆఖరు గుండె చప్పుడు వరకూ జగన్ తోనే ఉంటానని ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పష్టం చేశారు.