Site icon NTV Telugu

Malladi Vishnu: ఏకపక్షంగా ఈసీ వ్యవహారం.. మేం ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవి..?

Malladi Vishnu

Malladi Vishnu

Malladi Vishnu: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ దూకుడు చూపిస్తోంది.. డీజీపీ సహా పోలీసు విభాగంలోని కీలక అధికారులను బదిలీ చేస్తోంది.. అయితే, ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు.. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.. ఇక, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి ఉందన్న ఆయన.. మేం ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు లేవు అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ కంప్లైంట్ ఇస్తే ప్రతిపక్ష నేతపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందన్నారు. ఇక, నిబద్ధతతో పనిచేసే అధికారులను ఎలక్షన్‌ కమిషన్‌ బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎస్ ను బదిలీ చేయించేందుకు ప్రతిపక్షాలు కంప్లైంట్లు ఇస్తున్నాయన్న ఆయన.. 2019లో పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఎందుకు పాత పథకంగా కనిపించలేదు? అని నిలదీశారు. విద్యార్ధులకు, రైతులకు సకాలంలో నిధులు అందనివ్వకుండా పథకాలు నిలిపేశారని మండిపడ్డారు. డీబీటీ ద్వారా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అన్ని పథకాలనూ ప్రజలకు నేరుగా అందించిందని గుర్తుచేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

Read Also: Anna Rambabu: జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధం..

Exit mobile version