Madhusudhan Reddy: శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని హితవుపలికారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది వాలంటీర్ వ్యవస్థ కదా? అని ప్రశ్నించారు. వాలంటీర్లను అవమానించడం సరికాదు.. కరోనా సమయంలో విదేశాలలో ఉన్నవారి తల్లిదండ్రులకు సహాయపడింది వాలంటీర్ వ్యవస్థ అన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని సూచించారు. కరోనా సమయంలో టీడీపీ జన్మ భూమి కమిటీలు ఏమైయ్యాయని నిలదీశారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఓ ఎర్రచందనం స్మగ్లర్ అంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి.. కాగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారంటూ విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు.. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయాన్ని మర్చిపోయి.. వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చడం ఏంటి అంటున్నారు.. మరోవైపు.. బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు భగ్గుమన్నారు.. తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Game Changer : రామ్ చరణ్ చేతిలో వున్న ఆ పుస్తకం ఏమిటో తెలుసా..?
అయితే, ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక, అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని గతంలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని గుర్తించారు. కానీ, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను మాత్రం సమర్థించేది లేదన్నారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నర ఆయన.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు.. వారి భవిష్యత్‌ను వారే పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే..