Site icon NTV Telugu

Kolusu Parthasarathy: నేడు టీడీపీ కండువా కప్పుకోనున్న వైసీపీ ఎమ్మెల్యే

Kolusu

Kolusu

Kolusu Parthasarathy: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. నేడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో పాటు బెజవాడ వైసీపీ మాజీ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్ర శేఖర్.. తదితర నేతలు ఈ రోజు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు పార్థసారథి, బొప్పన భవకుమార్, తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి)… అయితే, అధికారికంగా టీడీపీలో చేరకముందే.. పార్థసారథికి టికెట్‌ కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ-జనసేన తొలి జాబితాలోనే ఆయనకు స్థానం దక్కింది.. పార్థసారథికి నూజివీడు అసెంబ్లీ సీటు కేటాయించిన విషయం విదితమే.

Read Also: Kejriwal: సుప్రీంకోర్టులో నేడు పరువునష్టం కేసులో కేజ్రీవాల్‌కు సమన్లపై విచారణ

కాగా, ఎన్నికల ముందు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.. పెనమలూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని పక్కనబెట్టి.. మంత్రి జోగి రమేష్‌ను పెనమలూరు ఇంఛార్జ్‌గా పెట్టారు.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన పార్ధసారధి పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనా చేశారు. తాజాగా విడుదల చేసిన టీడీపీ – జనసేన తొలి జాబితాలోనే సీటు కూడా దక్కించుకున్నారు పార్థసారథి.. ఇప్పుడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు కొలుసు పార్థసారథి.

Exit mobile version