Annabathuni Sivakumar: తెనాలి ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శివకుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annabathuni Sivakumar: తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.. పోలింగ్ బూత్‌లో ఓ వ్యక్తిపై ఆయన చేయి చేసుకోవడం.. సదరు వ్యక్తి.. ఎమ్మెల్యేని తిరిగి కొట్టడం.. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు అతడిపై దాడి చేయడం క్షణాల్లో జరిగిపోయాయి.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ ఘటనపై స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఎమ్మెల్యే శివకుమార్.. అసలు అలా ఆ ఘటన ఎలా జరిగింది..? దాడికి ఎలా దారితీసిందనే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్.. ఈసీ ప్రత్యేక దృష్టి..
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
తెనాలి ఐతానగర్లో నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ రోజు ఉదయం వెళ్లాం అని తెలిపిన అన్నాబత్తుని శివకుమార్.. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నానా దుర్భాషలాడాడు.. నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు. బూత్‌లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు అని మండిపడ్డారు.. గొట్టిముక్కల సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ వ్యక్తి.. అయితే, నువ్వు అసలు నువ్వు కమ్మోడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడు..? పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించాడు.. మాల, మాదిగలకు కొమ్ముకాసే వ్యక్తివి నువ్వు అంటూ చెప్పలేని భాష వాడాడు.. పోలింగ్ బూత్‌లో ఉదయం నుండి అతడు హల్చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారని వివరించారు. అంతే కాదు.. అతడు బెంగళూరులో ఉంటూ ఇక్కడకు వచ్చి హడావిడి చేశాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను పిలిపించి.. వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నాబత్తుని శివకుమార్.
Read Also: AP Elections 2024: చివరి గంటల్లో పోలింగ్.. ఈసీ ప్రత్యేక దృష్టి..
మరోవైపు.. తెనాలిలో ఎమ్మెల్యే పై చేయి చేసుకున్న వివాదంలో గొట్టిముక్కల సుధాకర్ మాట్లాడుతూ.. క్యూలో ఉండి ఓటు వేయమని అన్నందుకే నాపై ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ దాడి చేశాడని ఆరోపించారు.. శివకుమార్ అనుచరుల దాడితో నేను పోలింగ్ బూత్ లో దాక్కోవాల్సి వచ్చిందన్నారు. నేను సామాన్య పౌరుడిని, నన్ను రక్షించాల్సినవాళ్లే నాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు పోలీసులు రక్షణ కల్పించాలి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు గొట్టిముక్కల సుధాకర్.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..