YSR Jayanthi: దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటూ కొనియాడారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్ని నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు వైఎస్ అన్నారు.. ఉచిత విద్యుత్ తో ఎంతో మంది రైతులు మేలు పొందారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారని పేర్కొన్నారు.. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్సార్. దేశం లోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. ఫీజురీయింబర్స్ మెంట్ వల్ల ఎంచో మంది విద్యావంతులయ్యారు.. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు.
Read Also: HYDRA : రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు.. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ వివాదం
ఇక, రెండు పర్యాయాలు కాంగ్రెస్ ను జాతీయస్థాయిలో నిలబెట్టింది వైఎస్సారే అన్నారు వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్సార్ ఆశయాల సాధనకోసం ఏర్పాటైన పార్టీ వైసీపీ.. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని అభివర్ణించారు.. తండ్రి నాలుగు అడుగులు వేస్తే.. కొడుకుగా జగన్ 10 అడుగులు ముందుకు వేశారన్న ఆయన.. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీలను తెచ్చారు.. రైతే రాజులా ఉండాలని వైఎస్సార్, జగన్ పాలన అందించారని గుర్తుచేశారు.. అయితే, కూటమి పాలనలో అరాచకం కొనసాగుతోంది.. కక్ష సాధింపుకే అధికారాన్ని వాడుకుంటున్నారు.. అన్ని వర్గాల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. కూటమి అరాచకాలను తిప్పికొట్టేలా పోరాడదాం.. మళ్లీ వైసీపీ అధికారంలోకి తెచ్చుకుందాం అని పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి..
Read Also: Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..
మరోవైపు, వైఎస్సార్ ఎంతో మహోన్నతమైన వ్యక్తి.. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి వైఎస్సార్ అండగా ఉండేవారు.. నేనున్నాను అనే ధైర్యం అందరిలోనూ కల్పించిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. అనేక రాష్ట్రాల్లో వైఎస్సార్ గురించి నాయకులు గొప్పగా చెప్పుకునే వారు. వైఎస్సార్ ఆలోచనలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లారు. వైఎస్సార్ రైతు రాజ్యం.. రామరాజ్యం రావాలంటే మనమంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలని సూచించారు అయోధ్యరామిరెడ్డి..
Read Also: Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..
ఇక, మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. తన పాదయాత్రతో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు.. 2009 లోనూ కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్సార్.. కాంగ్రెస్ పార్టీ, నయవంచకుడు చంద్రబాబు కలిసి వైఎస్సార్ బిడ్డ జగనన్నను ఇబ్బంది పెట్టారు.. జగనన్న తన పాలనతో భారదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమయ్యాడు.. తల్లికి వందనం పథకం ఇచ్చి చంద్రబాబు తల్లడిల్లిపోతున్నాడు అని విమర్శించారు.. అయితే, ఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్లీ వచ్చేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు జోగి రమేష్.. మరోవైపు.. వైఎస్సార్ పేద ప్రజల చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని అభివర్ణించారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. పేదలు మెరుగైన ఆరోగ్యం పొందుతున్నారంటే అది వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లే.. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే వైఎస్సార్ ఆశయాలు కొనసాగుతాయన్నారు శ్రీనివాసరావు..
