Site icon NTV Telugu

YV Subbareddy: ఎగ్జిట్ పోల్‌తో సంబంధం లేదు.. ప్రజలపై నమ్మకం ఉంది..

Yv Subbareddy

Yv Subbareddy

YV Subbareddy: ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు వేరని.. మాకు ప్రజలపై అపారమైన నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్‌తో సంబంధం లేదని.. 36 గంటలు ఆగితే కరెక్ట్ రిజల్ట్ వస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మళ్లీ మేము అధికారంలోకి వస్తామన్నారు. ఏ తుఫాను ఏ సునామీ లేదు ప్రజలు చాలా కూల్‌గా ఓట్లు వేశారన్నారు. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కూటమి తుఫాను సునామీలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో మీరే గమనించాలని.. దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంటు ఎన్నికలు అని ఆయన వెల్లడించారు. పెద్ద రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్నారు. ఈ ఎగ్జిట్ పోల్‌ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Read Also: Chandrababu: కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.

Exit mobile version