Pulivendula Elections: వైస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ నేడు విజయవాడలో పులివెందులలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడన్నారు. అలాగే దీన్ని ఏమైనా ఎన్నిక విధానం అంటారా చంద్రబాబు అంటూ.. అసలు ఏమైనా ఆలోచన ఉందా అంటూ రెచ్చిపోయారు. ఇంకా ఆ ప్రాంతంలో ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు.
Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..!
గతంలో నంద్యాలలో జరిగిన ఉపఎన్నికలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించాడమీ ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా పులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందంటూ మండి పడ్డారు. సీఎం పులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నాడని.. ప్రతీ పోలింగ్ కేంద్రం లోపలా, బయట సీసీ కెమెరాలు పెట్టాలని కోరామని అన్నారు.
Dhanush-Mrunal Thakur :ధనుష్ తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన మృణాల్..
పులివెందుల, ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించాడని.. ఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైసీపీనే అంటూ ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది వైసీపీ జెండానే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
