Rajahmundry Crime: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. రాజమండ్రి మాజీ కార్పొరేటర్, వైసీపీ డివిజన్ నేత బూరడ భవానీ శంకర్‌ను దుండగులు దారుణంగా కత్తులతో పొడి చంపారు.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న భవానీ శంకర్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు దుండగులు.. విచక్షణా రహితంగా చాకుతో పొడిచారు.. తీవ్రగాయాలపాలైన శంకర్‌ను హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు, కుటుంబ సభ్యులు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు శంకర్.. ఒంటిపై పలుచోట్ల గాయాలను గుర్తించారు పోలీసులు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న త్రీ టౌన్ పోలీసులు.. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. అసలు భవానీ శంకర్ పై దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత వ్యవహారాలే హత్యకు దారి తీశాయా? అనే విషయం తేల్చే పనిలో పడిపోయారు త్రీటౌన్ పోలీసులు.
Read Also: Polygaymy: అస్సాం సీఎం సంచలన నిర్ణయం.. “బహుభార్యత్వం” నిషేధం వైపు అడుగులు