రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ,గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరంతా రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో భేటీ అయి పలు అంశాల గురించి చర్చిస్తున్నారు.
Read Also: Vishal-Abhinaya: విశాల్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన అభినయ
కాపులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు రాజమండ్రిలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు ఇకపై ఏం చెయ్యాలని ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని కాపు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్పటికే దిశా నిర్దేశం చేశారు. కాపు నేతల భేటీ అనంతరం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహిస్తారు.వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధులు సమావేశం పెట్టుకుంటే పవన్ కళ్యాణ్‌కు కంగారెందుకని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Read Also: Bhakthi Tv Kotideepotsavam 2022: భక్తి టీవీ కోటిదీపోత్సవం.. ఆధ్యాత్మిక సంరంభం… ఈరోజే ప్రారంభం
ఇదిలా వుంటే.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఓ లేఖను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఏపీలో రాజ్యాధికారం కోసం 22 శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గానికి ఓ అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ముందుకు వెళుతున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు అండగా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉంటూ పవన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని కొందరు చేసిన విమర్శలకు ధీటుగా పవన్ చెప్పును చూపించాడాన్ని కాపు సంక్షేమ సేన సమర్దిస్తోంది.
2024 ఎన్నికలలో కాపులు, బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేయటానికి సిద్ధం కావాలి.’’ అని హరిరామ జోగయ్య కోరారు. రాబోయే ఎన్నికల్లోనూ జనసేనకు సీట్లు రాకుండా చేయాలని, కాపు ఓట్లు జనసేనకు పడకుండా పకడ్బందీ వ్యూహం పన్నుతోంది వైసీపీ. జనసేన మాత్రం వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని, రాబోయే ఎన్నికలకు తగిన ప్రణాళికతో ముందుకు వెళతామంటున్నారు.