NTV Telugu Site icon

Gannavaram Politics: యార్లగడ్డను లైట్ తీసుకున్న వైసీపీ..! నెక్ట్స్ ఏంటి..?

Yarlagadda

Yarlagadda

Gannavaram Politics: గన్నవరం పాలిటిక్స్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత హీట్‌ పెంచాయి.. గన్నవరంలో ప్రస్తుత రాజకీయాలపై సజ్జల స్పందిస్తూ.. యార్లగడ్డ వెంకట్రావు ఎటు వెళ్లాలన్నది అతని ఇష్టం.. ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన చోట.. మరొకరికి సర్దుబాటు చేస్తాం.. కాదనుకుంటే వారి ఇష్టమన్నారు.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి నిర్ణయాలు వారివే కదా అని చెప్పుకొచ్చారు.. అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారాన్ని వైసీపీ అధిష్టానం లైట్‌గా తీసుకున్నట్టు స్పష్టమైంది.. అంతేకాదు.. ఉంటే పార్టీలో ఉండండి.. లేదా వెళ్లిపొండి అనే సంకేతాలు కూడా ఇచ్చేశారు. దీంతో, తన భవిష్యత్‌పై కసరత్తు ప్రారంభించారు యార్లగడ్డ వెంకట్రావు.

Read Also: Hyderabad: రామాంతపూర్ లో విషాదం.. షెటిల్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..

ఇప్పటి వరకు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి తన సంగతి తేల్చాలని అడుగుతానన్న యార్లగడ్డకు.. అలాంటివేవీ ఉండవనే సంకేతాలు ఇచ్చేశారు సజ్జల.. వైసీపీకి దూరం అయ్యేందుకు కొంతకాలంగా యార్లగడ్డ ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ వచ్చింది.. రెండ్రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని అవేదన కూడా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. పార్టీ వీడటానికే ఆ సమావేశాన్ని యార్లగడ్డ ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.. యార్లగడ్డ వైఖరిని పసిగట్టిన వైసీపీ అధిష్టానం.. మాటల్‌ లేవ్.. మాట్లాడుకోవడాలు లేవ్.. అన్నట్టుగా.. చర్చించడాలు లేవని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తంగా యార్లగడ్డను వదిలేసిన వైసీపీ.. ద్వారాలను మూసివేసినట్టే అనే చర్చ సాగుతోంది.. పార్టీలో ఉండటం ఉండకపోవడం యార్లగడ్డ ఇష్టం అని తేల్చేయడంతో.. ఇక, భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ పెట్టారట యార్లగడ్డ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రేపో మాపో ఆయన సైకిల్‌ ఎక్కడం ఖాయమనే చర్చ సాగుతోంది.

Gannavaram Politics- LIVE: యార్లగడ్డ వెంకట్రావును లైట్ తీసుకున్న వైసీపీ..! | NTV