Site icon NTV Telugu

AP Assembly Session: ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు.. ఎప్పుడంటే..?

Ap Assembly

Ap Assembly

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చివరి అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు సాగుతున్నాయి.. ఈ టెన్యూర్ లో చివరి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ సిద్ధం అవుతోంది.. అనుకున్నది అనుకున్నట్టుగా సాగితే.. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. చివరి టెన్యూర్‌లో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ సమావేశాల్లో 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఎన్నికల ఏడాది కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.

Also: KTR: కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించిన కేటీఆర్

మరోవైపు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి.. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ రాకముందే.. అసెంబ్లీ సమావేశాలు ముగించాలనే యోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చివరి సెషన్ కావడంతో.. హాట్ హాట్ గా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

Exit mobile version