YSRCP Fourth List: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు ఆసక్తికరంగా మారాయి.. అయితే, ఈ పరిణామాలు సిట్టింగ్‌లను టెన్షన్ పెడుతున్నాయి.. ఇప్పటికే మూడు జాబితాలో విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాల్గో లిస్ట్‌పై కసరత్తుకు మూడు రోజులు బ్రేక్ ఇచ్చింది. ఇక, ఇవాళ వైసీపీ నాల్గవ జాబితాపై కసరత్తు కొనసాగనుంది.. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. మరో ఐదారు నియోజకవర్గాల్లో మార్పులపై స్పష్టతకు వచ్చింది..
Read Also: JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే.. ఇప్పటికే 9 స్థానాల్లో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం.. మరో మూడు స్థానాల్లో క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.. బాపట్లలో నందిగం సురేష్, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కడప నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఈ ముగ్గురిని ఈ సారి కూడా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మరో 13 లోక్‌సభ స్థానాలకు సంబంధించి మార్పులు జరిగే అవకాశం ఉంది.. అందులో విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, నంద్యాల, నెల్లూరు లోక్‌సభ స్థానాల్లో మార్పులు జరగనున్నాయి.. ఇప్పటికే ఈ స్థానాల్లో కొందరు నేతల పేర్లు పరిశీలిస్తున్నారు.. ఏ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టే అవకాశం ఉందని పరిశీలన చేస్తుందో.. వారి పేర్ల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..