YSRCP Lok Sabha Candidates: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇప్పటికే 11 లోక్‌సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు నియోజకవర్గాలకు కొత్త ముఖాలను ప్రకటించింది వైసీపీ. మిగిలిన స్థానాలకు గానూ నాలుగింటిలో సిట్టింగ్ ఎంపీలను మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మిగిలిన నియోజక వర్గాలకు అభ్యర్థులుగా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్న చర్చ జరుగుతోంది.. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ నేతగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఇక నంద్యాల లోక్‌సభ నియోజకవర్గము నుంచి మైనార్టీనీ బరిలోకి దింపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కడప మైనార్టీ నేత అంజద్ పాషా, నటుడు అలీ పేరు పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటు నెల్లూరు లోక్‌సభ నుంచి బొమ్మిరెడ్డి సురేష్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పై క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయాలని వైసీపీ ఆలోచనగా ఉందని ఆపార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక బాపట్ల నుంచి రావెల కిషోర్ బాబు తనయుడు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. బాపట్ల సిట్టింగ్ ఎంపీని తప్పించేందుకు వైసీపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇక అమలాపురం, విజయనగరం నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి దశలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Ponnam Prabhakar: మేము ఎవరికి వ్యతిరేకం కాదు.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం..
ఇక, వైనాట్ 175 అంటున్న అధికార వైసీపీ.. వరుసగా అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళ్తోంది. ఇదివరకే సమన్వయకర్తల 6 జాబితాలు విడుదల చేసింది. దాదాపు రెండు వారాల తరువాత వైసీపీ 7వ జాబితా విడుదలైంది. కేవలం 2 నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని నియమించారు పార్టీ అధినేత వైఎస్ జగన్. ప్రకాశం జిల్లాలో పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకు పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ లను పార్టీ సమన్వయకర్తలుగా నియామకం జరిగింది. పర్చూరు నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపకపోవడంతో .. ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు.
Read Also: JSW Steel : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చెందిన రూ.65 వేల కోట్ల ప్లాంట్ పనులు ప్రారంభం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధించింది.. ఈసారి ఆ సంఖ్యను పెంచి జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలన్న యోచనలో మంత్రాంగం నడుపుతున్న వైసీపీ అధిష్టానం 12 స్థానాలకు గానూ ఇప్పటికే 10 స్థానాల్లో మార్పులు చేసింది.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జులలో కొందరిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం మరికొందరికి స్థానచలనం చేసింది.. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో ఆయా నియోజకవర్గాలకు సంబందించి కొత్త అభ్యర్దులు బరిలో నిలవనున్నారు. పర్చూరు వైసీపీ ఇంచార్జీ ఆమంచి కృష్ణమోహన్ ను మార్చిన వైసీపీ అధిష్టానం యడం బాలాజీకి భాద్యతలు అప్పగించింది.. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని మార్చి నెల్లూరు జిల్లాకు చెందిన కఠారి అరవిందా యాదవ్ కు బీసీ మహిళల కోటాలో అవకాశం కల్పించింది. జిల్లా సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా కందుకూరు సీటును యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.. దీనికి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా కూడా కావటంతో అరవింద యాదవ్ కు అవకాశం కల్పించింది.. ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు , మూడో జాబితాలో 21 స్థానాలకు , నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. తాజాగా 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు.
