Site icon NTV Telugu

YSRCP: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ఈసీకి ఫిర్యాదు..

Pawan Babu

Pawan Babu

YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు ఈనెల 24 న నెల్లిమర్లలో, ఈనెల 25వ తేదీన రాజంపేట, రైల్వేకోడూరులలో ఎన్నికల ప్రచారం సందర్బంగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై వ్యక్తిగతంగా అనుచితవ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది వైసీపీ.. ఇక, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నప్పటికి వ్యాఖ్యలు చేశరని.. ఇది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ ప్రతినిధుల బృందం. కాగా, ఎన్నికల సందర్భంగా రాజకీయ నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్తున్న విషయం విదితమే.

Exit mobile version