NTV Telugu Site icon

YS Jagan: తెలుగు రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత విజయ దశమి శుభాకాంక్షలు..

Jagan

Jagan

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Nayab Singh Saini: అక్టోబర్ 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..

లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని జగన్ అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనక దుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Read Also: Kolkata: జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష.. ఒకరి పరిస్థితి విషమం

మరోవైపు.. రాష్ట్రంలో దసర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దుర్గాదేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు దుర్గామాత మాలను ధరించి నిష్టగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా.. రేపు దసరా పురస్కరించుకుని ఇళ్లలో కూడా మహిళలు పూజల్లో పాల్గొంటున్నారు.

Show comments