NTV Telugu Site icon

YSRCP Candidates List: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు..

Jagan

Jagan

YSRCP Candidates List: లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సామాజిక వర్గాల వారీగా 2019తో పోలిస్తే ఈసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ సీట్లను సీఎం జగన్ కేటాయించారు.

Read Also: Payal Rajput: బాత్ టబ్ లో మందు గ్లాసుతో రచ్చ చేసిన పాయల్.. వీడియో వైరల్..

ఇక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ దాదాపు 50 శాతం మేర సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైసీపీ కేటాయించింది. 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. ఇక, వంద సీట్లగానూ 84 ఎ‍మ్మెల్యే, 16 ఎంపీ సీట్లలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలకు జగన్ ఛాన్స్ ఇచ్చారు. ఎంపీ సీట్లలో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించగా.. మహిళలకు ఐదు ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక, ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే 175 సీట్లలో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, బీసీలకు 48, ఓసీలకు 91 స్థానాలను కేటాయించారు. మైనారిటీలకు 7, మహిళకు 19 ఎమ్మెల్యే సీట్లను సీఎం జగన్ ఇచ్చారు.

Read Also: Ajay Pratap Singh: బీజేపీకి షాక్.. రాజ్యసభ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా

అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే 7 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా ఇచ్చారు. ఇక, మహిళలకు 4 ఎమ్మెల్యే స్థానాలను ఎక్కువగా ఇవ్వగా.. 2019 ఎన్నికల సమయంలో బీసీలకు 41 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఇప్పుడూ 48 సీట్లు ఇవ్వగా.. మహిళలకు 2019లో 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. ఈసారి (2024)19 స్థానాలు అదనంగా ఇచ్చారు. ఇక, 2019లో మైనార్టీ వర్గాలకు 5 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వగా.. 2024లో ఏడు స్థానాలను కేటాయించారు. అలాగే, 2019తో పోలిస్తే మహిళలకు ఈసారి రెండు ఎంపీ సీట్లు ఎక్కువగా ఇచ్చారు. 2019తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4 ఎంపీ సీట్లను వైసీపీ అదనంగా కేటాయించింది.