NTV Telugu Site icon

Tiruchanur Tension:తిరుచానూరులో ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ టీడీపీ

Tpt

Tpt

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుచానూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ బస చేస్తున్న టెంట్‌లో సైట్ వద్ద నోటికి తెల్ల రిబ్లన్ కట్టుకుని కొందరు తిరుపతి వైసిపి కార్పొరేటర్లు సహా కేడర్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాతో రండి చేసిన అభివృద్ధి చూపిస్తామంటూ ఫ్ల కార్డులు చేత పట్టి నిరసనకు దిగారు వైసీపీ నేతలు.

Read Also: TTD Temple Jubileehills Live: జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై నిన్న తీవ్రమైన స్ధాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. దీంతో వైసీపీ నేతలు ఈ విధంగా నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు అలిపిరి పోలీసు స్టేషను కు వైసీపీ నేతలను తరలించారు. చంద్రబాబునాయుడు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. లోకేష్ నాయుడు గారు అవినీతిని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.

ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిపై అలాగే తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జేసీఎస్ అధ్యక్షుడు బాలిశెట్టి కిషోర్ ఆదర్వంలో యువగళం యాత్రలో నారా లోకేష్ బస చేస్తున్న కుటీరం వద్ద ఈరోజు ఉదయం శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాలిశెట్టి కిషోర్ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి గూర్చి ప్రశ్నించే అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జేసీఎస్ మద్దాలి శేఖర్ రాయల్, సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ మైలం శ్రీకాంత్ రెడ్డి, ఉదయ్ వంశీ, వాసు యాదవ్, ఇరగం అనిల్ రెడ్డి, సూరి, కొఠారి సుభాష్, ప్రదీప్, మించాల చందు, గోవర్ధన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Road Accident: కుప్పంలో ఘోర రోడ్డుప్రమాదం…ముగ్గురు వైద్యవిద్యార్ధులు మృతి