NTV Telugu Site icon

YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు

Ys Jagan

Ys Jagan

YSRCP: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ఈనెల 21న, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం, ఆరోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో–ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని.. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, జగన్‌గారి పుట్టినరోజు వేడుకలు అన్ని స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది.

Read Also: Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

Show comments