NTV Telugu Site icon

AP Elections 2024: ఆయనదే గెలుపు రూ.20 లక్షలు పందెం.. లేదు మా నాయకుడే.. రూ.50 లక్షలు పందెం..

Betting

Betting

AP Elections 2024: పోలింగ్‌ ముగిసింది.. మరో మూడు రోజులు ఆగితే.. నాలుగో రోజు ఫలితాలు రాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్‌ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాలుగోసారి గెలిచి మంత్రి పదవి చేపడుతాడని.. వైఎస్‌ జగన్‌ రెండోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తాడని నేను రూ.20 లక్షలు పందెం కాస్తాను.. ఎవరికైన ధైర్యం ఉంటే పందెంకు రావాలని.. రేపు ఒకటో తారీఖున కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటానని అక్కడకు రావాలని బహిరంగంగా సవాల్ విసిరారు మంగమ్మ..

Read Also: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. (వీడియో)

అయితే, కోసిగి జడ్పీటీసీ మంగమ్మకు ధీటుగా మంత్రాలయం మండలం వగరూరుకు చెందిన టీడీపీ నాయకుడు మడ్రి చిన్నన్న.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రతిసవాల్ చేశారు.. రూ. 50 లక్షలు విలువ చేసే రెండు ఎకరాల పొలం పందెం కాస్తానని ప్రతి సవాల్ వదిలారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నిబంధనల విరుద్ధంగా పందెం కాయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇరు పార్టీల బహిరంగంగా నాయకులు సోషల్ మీడియా ద్వారా పందెం కాయడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఇరువర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని సిటిజన్స్ అంటున్నారు.