NTV Telugu Site icon

YSR University Of HealthSciences: ఇప్పటినుంచి వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌

Jagan Ysr

Jagan Ysr

ఇప్పటివరకూ విజయవాడలో వున్న ఎన్టీరామారావు హెల్త్ యూనివర్శిటీ ఇక నుంచి వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారిపోయింది. టీడీపీ సభ్యుల నిరసన, సస్పెన్షన్ అనంతరం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు మార్పును ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. అంతకుముందు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు మంత్రి విడదల రజిని. ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబుకు గౌరవం లేదు. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్‌ పేరు తీసేస్తామని బాబే చెప్పారు. ఎన్టీఆర్‌ అవసరం లేదని చంద్రబాబే చెప్పారు. ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. వైఎస్సార్‌ గొప్ప మానవతావాది. కేంద్రంతో టీడీపీకి పొత్తు ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారు?. రాష్ట్ర ప్రజలు బాగుపడటం టీడీపీకి ఇష్టం లేదన్నారు మంత్రి విడదల రజిని.

Read Also:Ntr Health University Row: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రగడ

హెల్త్‌వర్శిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడం సంతోషకరం. ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని వైఎస్సార్‌ తెచ్చారు. వేల ప్రాణాలను ఆరోగ్యశ్రీ కాపాడింది. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు మంత్రి రోజా. సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం జగన్ బిల్లుపై సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం. నేను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదు. ఎన్టీఆర్‌ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదు. చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్‌ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారు. చంద్రబాబు ఎప్పటికీ సీఎం అయ్యేవారు కాదన్నారు జగన్.

స్వంత అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు, రెండుపత్రికలు చేసిన పని వల్ల మానసిక క్షోభతో మరణించారు. మన పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన్ని మనం ఏం అనలేదు. పాదయాత్రలో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతానన్నాను. పేరు కూడా పెట్టాను. 2019 ఎన్నికలకు పోయేటప్పుడు ఎన్టీఆర్ పేరు ఎలా మర్చిపోయేలా చేయాలనేది చంద్రబాబు మాట్లాడిన మాటలు వీడియోలు చూశాం. వాడు వీడు.. అని ఎన్టీఆర్ ని అగౌరవపరిచారు అన్నారు సీఎం జగన్. చంద్ద్రబాబుకి తన కూతురిని అల్లుడికి గిఫ్ట్ గా ఇస్తే.. అల్లుడు వెన్నుపోటుని రిటన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. తాను కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు చెబుతుంటారు. ఎంతోమంది రాష్ట్రపతుల్ని చేశానని, ఎంతోమందిని ప్రధానుల్ని చేశానంటారు. మోడీ కూడా తనకంటే జూనియర్ అంటారు. పేరు మార్చడానికి అనేక విధాలుగా ఆలోచించాక.. కరెక్ట్ అనిపించాక అడుగులు ముందుకు వేశానన్నారు సీఎం జగన్.

Read Also:Malakpet Accident : నాకు హెల్మెట్ ఉంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను.. కానీ..

ఏపీలో అమలవుతున్న 108, 104 పథకాలకు సృష్టికర్త వైఎస్సార్. ఆయన డాక్టర్ గా పనిచేశారు. పులివెందుల లో ఆస్పత్రి పెట్టి మంచి పేరు సంపాదించుకుని, రాజకీయాల్లోకి వచ్చారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, డాక్టర్ వైఎస్పార్. కుటుంబంలో వ్యక్తి వైద్యం అందక మరణిస్తే కుటుంబం ఎలా తట్టుకోలేకపోతుందో ఆయనకు తెలుసు. ఖరీదైన కార్సొరేట్ వైద్యాన్ని పేదలకు అందించారు మానవతావాద మహా శిఖరం వైఎస్సార్. ఆరోగ్యరంగంలో వెలిగే సూర్యుడు వైఎస్పార్. ప్రధానితో సహా అంతా కొనియాడే వ్యక్తి వైఎస్సార్ అన్నారు జగన్. ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలు వున్నాయి.

ఇందులో 8 కాలేజీలు టీడీపీ పుట్టకముందే వచ్చాయి. శ్రీకాకుళం, ఒంగోలు, కడప కాలేజీలు పెట్టింది వైఎస్సార్. మొత్తం 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్, ఆయన కొడుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏర్పాటవుతున్నాయి. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. తమ ప్రభుత్వం వుందని తమకిష్టమయిన పేరు పెట్టుకున్నారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వారికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? మాకు ఎన్టీఆర్ అంటే కల్మషం లేదు. ఆయన పై అభిమానం వుంది. ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. భారీగా 104, 108 అందుబాటులో తెచ్చాం. విప్లవాత్మక మార్సులతో వైద్యరంగం మారబోతోంది. విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. WHO GMP మందులు అందుబాటులోకి తెచ్చాం. 40,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరో 4000 అక్టోబర్ నాటికి రిక్రూట్ చేస్తున్నాం. ఎవరికీ అగౌరవం కలిగించేది కాదన్నారు. వారికి సంబంధించిన క్రెడిట్ డ్యూ వుంటే అది కూడా చేస్తాం. ఈ బిల్లుని ఆమోదించాలని జగన్ శాసనసభను కోరారు. అనంతరం సభ బిల్లుకి ఆమోద ముద్ర వేసింది.