NTV Telugu Site icon

Ys Viveka Case: వైఎస్ వివేకా కేసు.. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంలో విచారణ

Viveka 1

Viveka 1

వివేకానంద రెడ్డి హత్య కేసు (Ys Viveka Case)  కీలక మలుపులు తిరుగుతోంది. కాసేపటి క్రితం సుప్రీంకోర్టు (supereme court of india) కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై విచారణలో ఇవాళ కీలక ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు.దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Ys Viveka Case) కూతురు, సునీత రెడ్డి తరఫున న్యాయవాది సిద్దార్థ్ లోద్రా వాదనలు వినిపించనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేసే విచారణకు ఆటంకం కలిగించేలా ఉందనే అంశంపై వాదనలు వినిపించనున్నారు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్ద్ లోద్రా. గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ముందస్తు బెయులు ఇవ్వడం, ఇవ్వకపోవడం పై ఇచ్చిన తీర్పులకు భిన్నంగా, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం దృష్టికి సునీతా రెడ్డి తరఫు న్యాయవాది తీసుకురానున్నారు.

Read Also:Crop Loss: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అన్నదాతకు అపార నష్టాలు

నిందితుల కుటుంబ సభ్యులు సిబిఐ అధికారులపైనే కేసులు నమోదు చేయడం బెదిరింపులకు పాల్పడ్డారనే అంశాన్ని ధర్మాసనం దృష్టి కి తీసుకురానున్నారు సునీతా రెడ్డి తరఫు న్యాయవాది. పిటీషనర్ సునీతారెడ్డి, ఆమె భర్తే వివేకానంద రెడ్డి హత్యకు కారకులని ఆరోపణలు
చేయడం, వారినే విచారణ చేయాలని అవినాష్ కోరడం అభ్యంతరకరమని వాదనలు వినిపించనున్నారు సునీతా రెడ్డి న్యాయవాది. పైగా, తనను విచారణ చేయడాన్ని అవివాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, విచారణకు సహకరించకపోవడమేనని విచారణ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ధర్మాసనం దృష్టికి తేనున్న పిటిషనర్ న్యాయవాది.

Read Also: American Airlines: గాల్లో ఉండగా విమానంలో మంటలు.. ఓహియోలో అత్యవసర ల్యాండింగ్